తలైవిగా కంగనా !

  • In Film
  • March 23, 2019
  • 159 Views

ఎవరెమనుకున్నా
తన మనసు ఉన్న మాటలు ధైర్యంగా చెప్పడంతో పాటు ఎవరు ఎంతలా వ్యతిరేకించినా తాను అనుకున్నది
చేసితీరే డైనమిక్‌ లేడీ కంగనా రనౌత్‌ మణికర్ణిక చిత్రంతో నటిగా,దర్శకురాలిగా కూడా విమర్శకుల
మెప్పు పొందింది.తన బయోపిక్‌లో తానే నటించనున్నట్లు సంచలన ప్రకటన చేసిన కంగనాకు మరో
భారీ ఆఫర్‌ వచ్చింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో జయలలిత పాత్రను
కంగనాకు ఆఫర్‌ చేసినట్లు సమాచారం.తలైవి పేరుతో తమిళం,తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కించనున్న
ఈ చిత్రంలో కంగనా జయలలిత పాత్రలో నటిస్తే దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లో
కూడా చిత్రానికి ఆదరణ దక్కుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. నేడు(శనివారం)కంగనా
పుట్టినరోజు సందర్భంగా చిత్రానికి సంగీతం అందించనున్న జీవీ ప్రకాశ్‌ ట్విట్టర్‌ ద్వారా
విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.గ్యాంగ్‌ ఆఫ్‌ వస్సెపూర్‌ చిత్రం అనంతరం తలైవి చిత్రంతో
బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నా.కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రానికి ఏఎల్‌
విజయ దర్శకత్వం వహించనుండగా విబ్రి మీడియా,విష్ణు ఇందూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.ఇక
కంగనా రనౌత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలని జీవీ ప్రకాశ్‌ ట్విట్టర్‌లో తెలిపాడు.జయలలితపై
చిత్రం తీయడానికి దర్శక నిర్మాతలు జయలలిత కుటుంబ సభ్యుల నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు
సమాచారం.తొమ్మిది నెలలుగా జయలలిత జీవితచరిత్రపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos