జగన్‌ ప్రమాణ పత్రం ఎన్నికల చరిత్రలో దాఖలా

అమరావతి:‘రాష్ట్రంలో కెల్లా అతి పెద్ద ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసిన ఘనత వైకాపా నేత జగన్‌కే చెల్లుతుంది,  31 కేసుల్లో నిందితుడు. ఇన్ని నేరాలతో ఇంకెవ్వరూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయరు. ఎన్నికల చరిత్రలోనే దాఖలా’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసారు. శనివారం ఉదయం ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెదేపా నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ‘జగన్‌ది సైకో మనస్తత్వం. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేస్తున్నార’ని ఆరోపించారు. జగన్ ద్వారా ఆంధ్రా ఆస్తుల్ని కబ్జా చేసేందుకు  కేసీఆర్ పన్నిన కుట్రను విచ్చిన్నం చేస్తామని తేల్చి చెప్పారు.  తెలంగాణ నియంతయిన  కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్ ద్వారా పరిపాలన సాగించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల మాఫీ కోసమే  జగన్‌ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు కుదువ పెట్టారనే అభిప్రాయం జనాల్లో నానాటికి బలోపేతమవుతోందని అభిప్రాయపడ్డారు. ఓటుతో  వారికి గట్టి గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేసినపుడు  కాంగ్రెస్‌ పార్టీ పట్ల జనంలో నెలకొన్న అసంతృప్తి ఆగ్రహాలు ఇప్పుడు వైకాపా పట్ల కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos