ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ట్విట్టర్లో కోటీ 46 లక్షల మంది అనుసరిస్తున్నారు (ఫాలోవర్లు). ఆయన 2011 నవంబరులో తన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇప్పటిదాకా 27 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఆయన తర్వాతి స్థానంలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ ఉన్నారు. ఆయనను 69 లక్షల మంది అనుసరిస్తున్నారు. 47 లక్షల 70 వేల మంది అనుచర గణంతో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాన్ని చంద్రబాబు నాయుడు ఆక్రమించారు. ఆయనను 41 లక్షలా తొంభై వేల మంది అనుసరిస్తున్నారు. ఎన్నికల సంవత్సరమనో…ఏమో..ఆయన ఈ ఏడాది ప్రారంభం నుంచీ ట్విట్టర్లో దూకుడు పెంచారు.