ఆంబులెన్సులో వచ్చిన అభ్యర్థి

మంత్రాలయం: మంత్రాలయం విధాన సభ తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి శుక్రవారం ఆంబులెన్సులో స్ట్రెచర్పై వచ్చి నామ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఇటీవల నియోజక వర్గంలోని ఖగ్గల్లులో ఎన్నికల ప్రచార సందర్భంగా జరిగిన గొడవల్లో ఆయన కాలల్లో తూటాలు దూసుకు పోవటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖగ్గల్లు గ్రామ చావడి వద్ద తెదేపా జెండాను ఎగుర వేసినందుకు వైకాపా అభ్యర్థి బాల నాగి రెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్ రెడ్డి గ్రామస్థులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. పరిస్థితి నియంత్రణకు తిక్కారెడ్డి అంగరక్షకుడు గాల్లోకి రెండు సార్లు తుపాకి కాల్పులు జరిపినపుడు ఒక తూటా తిక్కారెడ్డి కాలు లోపలికి దూసుకెళ్లింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos