
ధార్వాడ: ధార్వాడలో కూలిన భవనం శిథిలాల కింద దాదాపు 62 గంటల పాటు మృత్యువుతో పోరాడిన సోము అనే వ్యక్తిని సహాయక సిబ్బంది శుక్రవారం సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. కుమా రేశ్వర లేఅవుట్‌లో నిర్మాణ దశలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం గత మంగళ వారం కుప్ప కూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన నూరు మందిలో డెబ్బై మందిని పోలీసులు, సహాయ సిబ్బంది ఘటనాస్థలానికి రక్షిం చారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేసారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. సోమును రక్షించిన వీడియోను పోలీసు అధికారి ఒకరు సామాజిక మాధ్యమానికి ఎక్కించారు. ఈ భవనం మాజీ మంత్రి వినయ్ కులకర్ణి బంధువుల దిగా పోలీసులు గుర్తించారు. నాసి రకం సిమెంటు, ఇనుము, ఇతర సామగ్రిని వాడినందున భవనం కూలిందని స్థానికుల ఆరోపణ. భవన యజమా నులు నలుగురు పోలీసులకు లొంగి పోయారు. భవనం నిర్మించిన ఇంజినీర్‌ను కూడా పోలీసులు నిర్భంధించారు.