ఇదేనా మీ కాపలా? మాయవతి

లక్నో:‘రాఫెల్’ రహస్య పత్రాలు చోరీ కాకుండా కాపాడలేని చౌకిదార్లు నిరుద్యోగం, రైతు సమస్యల కీలక వివరాలు బయటికి రానివ్వడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం ట్వీట్లలో ప్రధాని నరేంద్రమోదీని ఎద్దేవా చేశారు. ‘ఓట్ల కోసం ఈ వివరాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి కాపలాదారులు దేశానికి అవసరమా’ అని ప్రశ్నించారు. ‘నేనూ కాపాదారునే’ అని ప్రధాని మోదీ ప్రకటించుకోవటమే తరువాయి పలువురు భాజపా నేతలు, కేంద్ర మంత్రులు కూడా తమ పేర్లకు ముందు కాపలాదారు బిరుదును తగిలించుకున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ మాత్రం తాను కాపలాదారునా, ప్రజా సేవకుడినా, సన్యాసినా అనేది తేల్చుకోలేక పోతున్నార’ని హేళన చేసారు. ‘భాజపా నాయకులు రాజ్యాంగానికి, చట్టానికి నినిజమైన కాపలాదారులుగా ఉంటే బాగుంటుంది. ప్రజలు కోరుకునేది ఇదే’ అని మాయావతి వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos