లోక్‌సభ ఎన్నికల్లో
తెరాస నుంచి ఎంపీ సీటు దక్కకపోవడంతపై మహబూబ్‌నగర్ ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందించారు.ఇన్నేళ్ల
రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మచ్చ లేని రాజకీయాలు చేశామని అయితే తనపై వినిపించిన ఆరోపణల
కారణంగా తనకు టికెట్ దక్కలేదని భావిస్తున్నామన్నారు.అయితే తనకు కాకుండా మహబూబ్‌నగర్
టికెట్ ఇతరులకు కేటాయించడంపై తన వద్ద సమాధానం లేదన్నారు.సీఎం కేసీఆర్ తనను సొంత తమ్ముడిలా
చూసుకున్నారని పార్టీలో ఉన్నత పదవులు కల్పించారని లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్
దక్కకపోయినంత మాత్రాన తాను తెరాసను వీడబోనని స్పష్టం చేశారు.ఎప్పటికీ కేసీఆర్‌తోనే
ఉంటానని కేసీఆర్ ఏం చెబితే అదే చేస్తానని స్పష్టం చేశారు.తనకు టికెట్ రానివ్వకుండా
మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఉంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.తమ హయాంలో పాలమూరు-రంగారెడ్డి
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుమతులు సాధించామని జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు
రహదారి విస్తరణ పనులు కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు..