‘యోగి’ ది అరాచక పాలన

లక్నో : తాను ఉత్తర ప్రదేశ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలూ చోటుచేసుకోలేదని యోగి ఆదిత్యానాథ్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన తర్వాత అత్యధిక సంఖ్యలో మూక హత్యలు జరిగాయని గుర్తు చేశారు.ఇంకా మంత్రులు, ఆ పార్టీ నేతలు వారిపై గతంలో నమోదైన కేసులను రద్దు చేసుకోవడంలో మునిగిపోయారని ఎద్దేవా చేశారు. యూపీలో జరిగిన మూక హత్యలు, దాడులు దేశానికి చెడ్డపేరు తీసుకువచ్చాయని, న్యాయ స్ధానాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణలో యోగి సర్కార్ దారుణంగా విఫలమైందని, ఈ ప్రభుత్వం గో రక్షకులుగా చెప్పుకుంటున్న వారికి బాసటగా నిలిచిందని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos