
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని కర్త్ ఎ సాఖి ప్రార్థన మందిరం వద్ద గురువారం సంభవించిన బాబు పేలుళ్లలో ఆరు గురు మరణించారు. మరో 23 మందికి గాయపడినట్లు ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒక రుమాధ్యమాలకు వెల్లడించారు. పర్షియన్ నూతన సంవత్సర వేడుకల్లో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ వేడుకలు అక్కడి మత సంప్రదాయాలకు వ్యతిరేకమనే ఉగ్రవాదుల వాదన. కొందరు మోర్టార్ బాంబులతో దాడులకు దిగారని ఆఫ్ఘనిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి పరిస్థితులను అదుపులోకి తెచ్చినట్లు రక్షణ శాఖ అధికార్లు చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహ రించాయి. దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు. గతంలో షియా ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో దాడుల్ని జరిపిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర సంస్థ తాజా దాడుల్నీ జరిపి ఉంటుందని భావిస్తున్నారు.