ఒక్కో సినిమాతో అభిమానులను పెంచుకుంటున్న మెగా డాటర్ నిహారిక నటించిన కొత్త చిత్రం సూర్యకాంతం చిత్రం ప్రమోషన్లో భాగంగా నిహారిక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కాలేజీ యువతీ యువకులను కలుసుకుంటున్న విషయం తెలిసిందే.తాజాగా ఆంధ్రలోని ఓ కాలేజీకి వెళ్లిన నిహారికను కాలేజీ విద్యార్థులు పవర్‌స్టార్ నినాదాలు చేశారు.దీంతో మీరు ఇలా అరుస్తూ ఉంటే నేను ఏమనాలి అని అడగగా అందుకు విద్యార్థులు పవర్‌స్టార్ అనాలంటూ కోరారు.పవర్‌స్టార్ అంటే మీకేమొస్తుందంటూ నిహారికి విద్యార్థులను ప్రశ్నించింది.అందుకు విద్యార్థులు ఎనర్జీ వస్తుందంటూ బదులిచ్చారు.ఇక చేసేది లేక నిహారిక పవర్‌స్టార్ అంటూ నినదించింది.పవర్‌స్టార్ మేనరిజం చూపించాలని విద్యార్థులు అడగగా బద్రి సినిమా తరహాలో మెడపై చేతితో రుద్దుకునే సీన్‌ను అనుకరించింది.అదేవిధంగా డైలాగ్ చెప్పాలని కోరగా ఖుషి సినిమాలో డైలాగ్ చెప్పి విద్యార్థులను సంతోషపెట్టింది నిహారిక.చివరగా ఇక్కడ ఉత్సాహంగా పవర్ స్టార్ అని అరిచేవాళ్ళు జనసేనకు ఓటు వెయ్యాలని.. అలా చేస్తే పవన్ సీమ్ అవుతారని వాళ్ళకు సలహా ఇచ్చింది..