కన్నడ రెబల్‌స్టార్ దివంగత మాజీ మంత్రి అంబరీశ్ సతీమణి సుమలత
అంబరీశ్ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర
అభ్యర్థిగా బరిలో దిగనున్న విషయం తెలిసిందే.అందుకు సంబంధించి బుధవారం సుమలత మండ్య జిల్లా కలెక్టర్ మంజుశ్రీకి నామినేషన్ పత్రాలు
సమర్పించారు.నామినేషన్ పత్రాలతో పాటు తమ ఆస్తులు,అప్పుల గురించి అఫడవిట్ దాఖలు చేశారు.నామినేషపన్తో
పాటు సమర్పించిన అఫడవిట్లో సుమలత పేర్కొన్న వివరాలు పరిశీలిస్తే..
పేరు: సుమలత అమరనాథ్ అలియాస్ సుమలత అంబరీష్
భర్త పేరు : దివంగత ఎంహెచ్ అమరనాథ్ అలియాస్ అంబరీష్
కుమారుడు : అభిషేక్ గౌడ
చిరునామా : బెంగళూరు – జేపీనగర్ 2వ స్టేజ్ – 21వ మెయిన్ రోడ్డు
ఎలాంటి క్రిమినల్ కేసులు సుమలతపై లేవు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోని సంతేష్ జోసఫ్ కాన్వెంట్ స్కూల్లో 1977-78 సంవత్సరంలో 10వ తరగతి వరకు చదివారు.
– స్థిరాస్తి రూ.17 కోట్లకు పైగానే
– సుమలత స్థిరాస్థి 17కోట్ల 72 లక్షలు. ఇందులో 41 లక్షల విలువైన వ్యవసాయ భూమి .
– బెంగళూరులోని జేపీ నగర్ లో సొంత ఇల్లు – భవనం విలువ 17లక్షల72 వేలు. ఇక ఐటీ రిటర్న్స్ లో ఆర్థిక ఆదాయం 1కోటి 33 లక్షలుగా చూపించారు.
* అప్పుల వివరాలు
– సుమలత మొత్తం అప్పులు కోటి 42 లక్షలుగా పేర్కొన్నారు.
– ప్రమీళ అనే మహిళ దగ్గర రూ.45 లక్షల రుణం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
– సంతోష్ డీటీ అనే వ్యక్తి దగ్గర రూ.95 లక్షలు రుణం తీసుకున్నట్టు తెలిపారు.
– సెక్యూరిటీ బాండ్ లేకుండా రూ.2 లక్షల 32వేలు. బ్యాంకులు – ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదని సుమలత పేర్కొన్నారు..
నామినేషన్ సమర్పించిన అనంతరం శాండల్ఉడ్ హీరోలు దర్శన్,యశ్‌లతో కలసి మండ్య పట్టణంలోని వీధుల్లో రోడ్‌షో నిర్వహించి ప్రసగించారు..తాను హుచ్చే గౌడ కోడలినని రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి – అభిషేక్ తల్లినని అన్నారు. తాను పేరు ప్రతిష్టల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని.. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని సమలత పేర్కొంది. మండ్య జిల్లా ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సుమలత పేర్కొన్నారు.దర్శన్,యశ్‌లు తమ ఇంటి పిల్లలని తనను అంబరీశ్‌ను తల్లితండ్రులుగా భావించారని అందుకే తన తరపున ప్రచారాల్లో పాల్గొనడానికి వచ్చారంటూ సుమలత స్పష్టం చేశారు..
