ఈ ఏడాది ఆరంభంలోనే తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా F2 బంపర్‌హిట్ విజయానందంలో తేలియాడుతున్న విక్టరీ వెంకటేశ్‌కు త్వరలోనే జీవితాంతం తీపి జ్ఞాపకాలు మిగిల్చే కార్యక్రమం జరుగనుంది.అదే విక్టరీ వెంకటేశ్ ముద్దుల కుమార్తె అశ్రిత వివాహం వేడుక.వెంకటేశ్ కూతురు అశ్రిత వరంగల్‌కు చెందిన వినాయక్‌రెడ్డితో చాలా కాలంగా ప్రేమలో ఉంది.ఇరువురి ప్రేమకు రెండు కుటుంబాలు ఆమోదం తెలపడంతో త్వరలోనే అశ్రిత,వినాయక్‌రెడ్డిలు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.ఈ క్రమంలో అశ్రిత పెళ్లి చాలా ఘనంగా జరపడానికి దగ్గుబాటి కుటుంబ ఏర్పాట్లలో నిమగ్నమైంది.ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి పత్రికలు కూడా పంచేశారని జైపూర్ వేదికగా జరిగే ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఇటు దగ్గుబాటి కుటుంబానికి పరిచయం ఉన్న రాజకీయ నేతలతో పాటు వినాయక్‌రెడ్డి తరపు నుంచి కూడా రాజకీయ నేతలు హాజరు కానున్నట్లు సమాచారం.వినాయక్‌రెడ్డి తాత రామసహాయం సురేందర్‌రెడ్డి పలుమార్లు వరంగల్ ఎంపీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి సేవలు అందించారు.ఇక రాణా దగ్గుబాటి, నాగచైతన్య, సమంత,అఖిల్‌లు ఈ పెళ్లిలో డ్యాన్స్‌లు ఇరగదీయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..
