సామాజిక మాధ్యమాలకూ ఎన్నికల నియమావళి

దిల్లీ: రానున్న ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కూడా తొలి సారిగా ఎన్నికల నియమావళిని పాటించనున్నాయి. ఆ మేరకు అవి స్వచ్ఛం దంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వకంగా తెలిపాయి. దరిమిలా సార్వత్రిక ఎన్నికకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయ నున్నట్లు ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, గూగుల్, షేర్చాట్ తదితర సంస్థలు ప్రకటించాయి .ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఇటీవల జరిగిన సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధుల సమావేశం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీన్ని ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా హ ర్షించారు. ఎన్నికల నియమావళిని పాటించేందుకు సామాజిక మాధ్యమాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం మంచి పరిణామమని శ్లాఘించారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై సత్వర చర్యలు తీసు కోవటాన్ని విస్మరించబోమన్నారు. ఇచ్చిన హామీలకు ఆయా సంస్థలు కట్టుబడి ఉండాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos