అమ్మాయిలా మాట్లాడుతూ
పలువురు యువకులను మోసగించిన ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.నెల్లూరుకు చెందిన
శివమాధవ్ అనే యువకుడు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.అయితే వ్యక్తిగత
కారణాల వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలన్న ఉద్దేశంతో మోసాల బాట పట్టాడు.హార్మోన్ల
లోపంతో అమ్మాయి గొంతులా ఉండే తన గొంతునే అందుకు పెట్టుబడిగా ఎంచుకున్నాడు.డేటింగ్
సైట్‌లలో యువతి పేరుతో ఖాతాలు తెరచి అందులో తన ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాడు.ఈ క్రమంలో
ఏడాదిన్నర క్రితం కమల్‌కుంజ్ ప్రాంతానికి చెందిన అభివన్ అనే యువకుడితో మేఘన పేరుతో
పరిచయం పెంచుకున్నాడు.ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్న అనంతరం అభినవ్ ఫోటో పంపించాలంటూ
కోరగా తనకు వరసకు చెల్లెలయ్యే అమ్మాయి ఫోటో పంపించాడు.ఇలా కొద్ది రోజులు గడిచిన అనంతరం
అభినవ్ పెళ్లి ప్రస్తావన తేవడంతో నిందితుడు పెళ్లికి అంగీకరించినట్లు నమ్మించాడు.ఇక
అప్పటి నుంచి ఒకసారి తనకు ఆరోగ్యం బాగా లేదని మరోసారి తన తండ్రికి ఆరోగ్యం బాగా లేదని
నమ్మించి లక్షలాది రూపాయలు బదిలీ చేయించుకున్నాడు.గతనెల 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా
కలుద్దామంటూ అభినవ్ ప్రస్తావించగా సరేనని అంగీకరించిన నిందితుడు నెల్లూరులోని తన ఇంటికి
రావాలంటూ సూచించాడు.శివమాధవ్ మాటలు నమ్మిన అభివన్ నెల్లూరులోని శివమాధవ్ ఇంటికి
వెళ్లాడు.అయితే అభివన్ అక్కడికి చేరుకోక ముందే నిందితుడు శివమాధవ్ తన తల్లితండ్రులకు
ఫోన్ చేసి విషయం మొత్తం వివరించాడు.దీంతో అభినవ్ ఇంటికి రాగానే మాటలు కలిపిన నిందితుడి
తల్లితండ్రులు శివమాధవ్ చూపించిన అమ్మాయికి చెందిన మరో ఫోటో చూపించారు.మార్చ్ రెండవ
వారంలో పెళ్లి చేస్తామని అందుకు రూ.10లక్షలు కావాలంటూ శివమాధవ్ కోరడంతో అందుకు అంగీకరించిన
అభినవ్ నిందితుడు కోరినంత డబ్బు అందించాడు.ఇది జరిగిన మరుసటి రోజు నుంచే ఫోన్‌లు స్విఛాఫ్
రావడంతో అనుమానం కలిగిన మోసపోయానని గ్రహించిన అభినవ్ పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు
చేసుకున్న పోలీసులు మాదాపూర్‌లో ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్లు గుర్తించి శివమాధవ్‌ను
అరెస్ట్ చేశారు.విచారణలో అభినవ్‌తో పాటు మరో యువకుడిని కూడా శివమాధవ్ మోసం చేసినట్లు వెలుగు చయూసింది.నిందితుడు ఇంజినీరింగ్‌తో పాటు ఎంబీఏ పూర్తిచేశాక, కొన్నేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఐటీ కంపెనీలో చేరాడు. హార్మోన్ల లోపాల కారణంగా అతడి గొంతు యువతి గొంతులాగే ఉంటుంది. స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఏదీ చెప్పకుండా నాలుగేళ్ల క్రితం ఓ యువతిని పెళ్లిచేసుకున్నాడు. కొద్దిరోజులకే ఆమెకు అంతా అర్థమవడంతో, నష్టపరిహారం డిమాండ్ చేసింది. స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేసి చెల్లించాడు. అది తీర్చేందుకు ఇతరులను మోసంచేయాలని నిర్ణయించుకుని, అదే బాటలో నడిచి, చివరికి దొరికిపోయాడని పోలీసులు తెలిపారు.