తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే

తెదేపాలోకి వైకాపా ఎమ్మెల్యే

విజయవాడ : కర్నూలు జిల్లా నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే వై. ఐజయ్య బుధవారం తెదేపాలో చేరారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడుగా మారింది. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి లబ్బి వెంకటస్వామిపై, ఐజయ్య 22 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా తరఫున బండి జయరాజు, వైకాపా తరఫున ఆర్థర్‌ పోటీలో ఉన్నారు. సిట్టింగ్‌ అయిన తనకు టికెట్టు ఖరారు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఐజయ్య తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos