బ్రస్సెల్స్ : సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్‌లో చుక్కెదురైంది. కస్టమర్ల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ దానికి ఐరోపా విశ్వాస రాహిత్య నియంత్రణ సంఘం భారీ జరిమానాను విధించింది. గూగుల్ తన విధులను మరిచిపోయిందని, నమ్మకాన్ని కోల్పోయిందని యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ తెలిపారు. 1.49 బిలియన్ యూరోలను జరిమానా కింద చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయని వెల్లడించారు. మార్కెట్లో తనకు ఉన్న మంచి పేరును, అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేసుకుందని ఆరోపించింది. కొన్ని కంపెనీలు లాభపడితే, వినియోగదారులు మోసపోతున్నారని తెలిపారు. ఈ సంస్థ వినియోగదారుల చట్టాలకు వ్యతిరేకంగా పని చేసిందని, వారి స్వేచ్ఛను, ఎంపికను హరిస్తోందని ఆరోపించారు.