లఖ్‌నవూ : భాజపా ఉత్తరప్రదేశ్‌లో
సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంపై ఎస్‌పీ అధ్యక్షుడు
అఖిలేశ్ యాదవ్ ట్విటర్ వేదికగా బుధవారం విమర్శలకు దిగారు. సిట్టింగ్ లకు
తిరిగి ఇవ్వడం లేదంటే, వారు విఫలమయ్యారని అర్థం. ఆ లెక్కన జట్టుకు వర్తించే నియమం
సారథికీ వర్తిస్తుందని పరోక్షంగా ప్రధాని మోదీకి చురకలు అంటించారు. మరో వైపు
కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమిని ఓడించడానికి భాజపా బలమైన
అభ్యర్థులను పోటీ చేయించడానికి కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సిట్టింగులకు
ఈసారి టికెట్లు దక్కడం అనుమానంగా మారింది.