హైదరాబాద్…తెదేపా పొలిట్ బ్యూరో
సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో తెదేపా మనుగడ
ప్రశ్నార్థకమైనందున, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని
నిర్ణయించుకుని, పార్టీ పదవికి, ప్రాథమిక శాసన సభ్యత్వానికి రాజీనామా
చేస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రబాబుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. నామా తెరాసలో
చేరి, ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.