కుల్దీప్‌ ప్రధాన బౌలరే…చావ్లా

  • In Sports
  • March 20, 2019
  • 193 Views
కుల్దీప్‌ ప్రధాన బౌలరే…చావ్లా

కోల్‌కతా : ప్రపంచ కప్పులో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ప్రధాన బౌలర్ గానే కొనసాగుతాడని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పీయుష్‌ చావ్లా అభిప్రాయపడ్డాడు. ప్రతిభ ఆధారంగానే కుల్దీప్‌ ఈ స్థాయికి ఎదిగాడని అన్నాడు. అతనిలో మంచి నైపుణ్యం ఉందని, ఎప్పటికప్పుడు మెరుగ్గా రాణించడానికి కష్టపడుతూనే ఉంటాడని చెప్పాడు. ప్రపంచ కప్పులో కుల్దీప్‌తో పాటు చాహల్‌ వికెట్లు తీసి పెడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. అక్కడ టీమిండియాకు మంచి బ్యాట్స్‌ మన్‌ ఎదురైనప్పుడు కుల్దీప్‌ ప్రధాన ఆయుధంగా మారుతాడని విశ్లేషించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos