కాషాయాన్ని ఓడించండి:రాజ్‌ థాకరే

ముంబై:వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీ – షా ద్వయాన్ని ఓడించేందుకు కృతనిశ్చయంతో పని చేయాలని బుధవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధిపతి చీఫ్ రాజ్ థాకరే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫలానా పార్టీకి అని కాకుండా మోదీ-అమిత్షాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికలివని పేర్కొన్నారు. ‘మోదీ పని తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రచారం సాగించండి. విధాన సభ ఎన్నికలకు సమాయత్తం కండి. భాజపాకు వ్యతిరేకంగా నేను ప్రచారం సాగిస్తాను. మీరు ఆ ఇద్దరికీ (మోదీ-షా) వ్యతిరేకంగా పని చేయండి’ అని దిశా నిర్దేశం చేశారు. ప్రధాని చేపట్టిన నేనూ కాపలాదారుననే ప్రచారం ఎన్నికల ఎత్తుగడగా దుయ్యబట్టారు. ‘ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైన మోదీ సర్కార్ ప్రజలను తప్పదారి పట్టించేందుకే ఇలాంటి చౌకబారు ప్రచారానికి దిగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో ఎన్నికల పొత్తు కుదుర్చుకోవటం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాల్లో భాగంగా ఒకటి రెండు నెలల్లో పుల్వామా తరహా మరో దాడి జరగొచ్చని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos