
వాషింగ్టన్: ప్రపంచంలో జీవన వ్యయం తక్కువగా ఉన్న నగరాల పట్టికలో మన దేశంలోని దిల్లీ, చెన్నై, బెంగళూరుకు స్థానం లభించింది. ఎకనమిక్ ఇంటెలిజెంట్ యూనిట్ నిర్వహించిన 2019 ప్రపంచ జీవన వ్యయ అధ్యయనంలో ఇది తేలింది. 133 నగరాల్లోని 150 వస్తువుల ధరలను సమీక్షించి ఈ జాబితా రూపొందించారు. ఖరీదైన నగరాల జాబితాలో స్విట్జర్లాండ్లోని జురిచ్ నాలుగో స్థానంలో, జపాన్లోని ఒసాకో ,స్విట్జర్లాండ్లోని జెనీవా ఐదో స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకైన నగరాల జాబితాలో కరాకస్(వెనుజువేలా), డమస్కస్(సిరియా), తాష్కెంట్(ఉజ్జెకిస్థాన్),అలమటీ(కజకిస్థాన్, కరాచీ(పాకిస్థాన్), లాగోస్(నైజీరియా) ఉన్నాయి.