
మండ్య:నటి, దివంగత నటుడు అంబరీశ భార్య, మండ్య లోక్‌సభ నియోజక వర్గం స్వతంత్ర అభ్యర్థి సుమలత బుధవారం ఉదయం మండ్య జిల్లాధికారికి నామపత్రాల్ని సమర్పించారు. అనంతరం మండ్య నగరంలోని విశ్వేశ్వరయ్య ప్రతిమకు పూల మాలలు సమర్పించారు.తర్వాత అక్కడి సిల్వర్ జుబ్లి ఉద్యాన వనంలో జరిగిన బహిరంగ సభలో అత్యధిక సంఖ్యలో హాజరైన అభిమానుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనేక ప్రాంతాల నుంచి అభిమానులు, రైతులు ఎద్దుల బండ్లల్లో సభకు వచ్చారు. అంతకు ముందు జిల్లాధి కారి కార్యాలయం నుంచి జరిగిన ఉరేగింపులో కూడా చాలా మంది అభిమానులు పాల్గొన్నారు. సినీ నటులు దర్శన్, యశ్, దివంగత నటుడు అంబరీశ్ పేరిట నినాదాలు చేసారు.