కేవలం మూడు చిత్రాలతో తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లకు కలల రాణిగా
మారి తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్నకు సొంత రాష్ట్రంలో మాత్రం అందుకు
భిన్నమైన పరిస్థితులు ఎదరవుతున్నాయి.కన్నడ దర్శకనిర్మాత రిషబ్‌శెట్టితో చేసుకున్న నిశ్చాతార్థం
రద్దు చేసుకోవడంతో రష్మికపై కన్నడ సినీ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.ఇది
జరుగుతుండగానే విజయ్ దేవరకొండతో కలసి నటించిన గీతగొవిందం చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశంతో
కన్నడ సినీ అభిమానుల్లో రష్మికపై ద్వేషం మొదలైంది.ఇప్పటికీ కన్నడ సినీ అభిమానులు రష్మికపై
సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు.ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో
కలసి నటించిన రెండవ చిత్రం డియర్ కామ్రేడ్ టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది.తెలుగుతో
పాటు తమిళం,కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదలైంది.అయితే డియర్ కామ్రేడ్ టీజర్‌లో
కూడా విజయ్,రష్మికల మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉండడంతో కన్నడ సినీ అభిమానులు మరోసారి
రష్మికపై ఫైర్ అయ్యారు.దీనిపై రష్మిక స్పందిస్తూ..చిన్న టీజర్ చూసి ఇలా ఒక నిర్ణయానికి రావడం సరికాదని కథ డిమాండ్ చేయనిదే నేను ఏది చేయనని మేలో పూర్తి సినిమా చూశాక అప్పుడు చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ ఒక్క మాట అందరిని సంతృప్తి పరిచేది కాదు కాని ఇక్కడో చిన్న లాజిక్ మిస్ అవుతోంది. నిజంగా కథ ప్రకారం పెదవులు పంచుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా అదేదో సర్ప్రైజ్ లాగా నేరుగా స్క్రీన్ మీద చూపిస్తే ఇంకా థ్రిల్ వచ్చేది. ప్రేక్షకులు కూడా ఆమోదించే వాళ్ళు.అలా కాకుండా ప్రమోషన్ లో అతి కీలకంగా భావించే ఫస్ట్ టీజర్ సగం షాట్ ఇలా ముద్దు సన్నివేశంతోనే చూపించేస్తే ఎలా. అంటే ఇది ఉందని చెబుతూ యూత్ ని ఆకర్షించి మార్కెట్ డిమాండ్ ని పెంచుకోవాలనే ఉద్దేశమేగా. నెటిజెన్లు ఈ కోణంలోనే ప్రశ్నిస్తున్నారు