ఏక్తా కపూర్‌ను వెంబడించిన క్యాబ్‌ డ్రైవర్..

ఏక్తా కపూర్‌ను వెంబడించిన క్యాబ్‌ డ్రైవర్..

చాలా కాలంగా
నిర్మాత ఏక్తా కపూర్‌ను వెంటపడి వేధిస్తున్న క్యాబ్‌ డ్రైవర్‌ను ముంబయి పోలీసులు అరెస్ట్‌
చేశారు.ఈ ఘటన ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.హర్యాణ రాష్ట్రానికి చెందిన సుధీర్‌
రాజేందర్‌ సింగ్‌ అనే వ్యక్తి ముంబయిలో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.నిర్మాత
ఏక్తా కపూర్‌ను ఒక్కసారి కలవడానికి సుధీర్‌ తీవ్రంగా ప్రయత్నించసాగాడు.ఈ క్రమంలో కొద్ది
నెలలుగా సుధీర్‌ చాలా చోట్ల ఏక్తా కపూర్‌ను వెంబడించి కలుసుకోవడానికి విఫల యత్నాలు
చేశాడు.తనను పలు చోట్ల వెంబడిస్తున్నట్లు గుర్తించిన ఏక్తా కపూర్‌ కొద్ది రోజుల క్రితం
తన అంగరక్షకులతో సుధీర్‌ను హెచ్చరించింది.అయినప్పటికీ వెంట పడడం మానుకోలేదు.ఏక్తా వ్యాయమాల
కోసం ఏ జిమ్‌కు వెళుతుందో గుర్తించిన సుధీర్‌ తాను కూడా అదే జిమ్‌లో చేరాడు.ఈ క్రమంలో
గత శనివారం ఏక్తా కపూర్‌ను జిమ్‌లో కలుసుకొని మాట్లాడడానికి యత్నించాడు.మంగళవారం కూడా
మరోసారి ఏక్తాను కలవడానికి యత్నించడంతో ఏక్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న
పోలీసులు సుధీర్‌ను అరెస్ట్‌ చేసి విచారించారు.అయితే తనకు,తన స్నేహితుడికి ఉద్యోగాల
కోసం ఏక్తా కపూర్‌ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఈ విషయం మాట్లాడడానికే ఏక్తాను
వెంబడించానని సుధీర్‌ పోలీసులకు తెలిపాడు.సుధీర్‌ చెప్పిన విషయాలు దర్యాప్తు చేస్తూనే
ఏక్తాను వెంబడించిన ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్‌లు పరిశీలిస్తూ ఏక్తాను వెంబడించడం
వెనుక మరో కోణం ఉందా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos