అవకాశాలు లేక వాచ్‌మెన్‌గా డ్యూటీ..

  • In Film
  • March 20, 2019
  • 167 Views
అవకాశాలు లేక వాచ్‌మెన్‌గా డ్యూటీ..

సనీ ఇండస్ట్రీ అంటేనే అదోక రంగుల మాయా ప్రపంచం.కష్టపడే తత్వంతో పాటు అదృష్టం కూడా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నిలబడడం సాధ్యం.కష్టపడే తత్వం ఉన్నా అదృష్టం లేక ఎంతమంది నటీనటులు రోడ్ల పాలైన ఘటనలు కోకొల్లలు.మరికొంతమంది ఆత్మన్యూనతకు,ఆర్థిక కష్టాలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తెలిసిందే. తాజాగా పలు చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందినా అవకాశాలు లేక ఓ సీనియర్‌ నటుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి వాచ్‌మెన్‌ అవతారం ఎత్తిన ఘటన వెలుగు చూసింది.2011లో అక్షయ్‌కుమార్‌ నటించిన పటియాల్‌ హౌస్‌ చిత్రంలో పోలీసు అధికారిగా నటించిన సవి సిద్దూకు ఆ పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చింది. దీంతోపాటు లులాల్‌,బేవకూఫియా తదతర చిత్రాల్లో నటించిన సిద్దూకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో వాచ్‌మెన్‌ ఉద్యోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.అందుకు సంబంధించి కొంతమంది సిద్దూ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో ప్రతీ ఒక్కరూ సిద్దూ చేస్తున్న పనిని అభినందించారు.చాలా మంది సిద్దూకు అవకాశాలు ఇవ్వాలంటూ దర్శకులు,నిర్మాతలకు మెసేజ్‌లు పెడుతున్నారు.దీనిపై బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందిస్తూ..సిద్దూ చేస్తున్న పని చిన్నది కాదని అలాగని పెద్దది కూడా కాదన్నారు.అయితే సిద్దూ చేస్తున్న పనిని మాత్రం ప్రశంసించకుండా ఉండలేమన్నారు.ఇక జాలిపడి ఏఒక్కరికి అవకాశాలు ఇవ్వకూడదని అలా చేస్తే వారిని అగౌరవపరచడమే అవుతుందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos