ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్‌?

  • In Film
  • March 20, 2019
  • 161 Views
ఆర్‌ఆర్‌ఆర్‌లో మరో ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్‌?

బాహుబలి చిత్రం సాధించిన విజయంతో తన తదుపరి చిత్రంపై అంతకు మించి అంచనాలు ఉంటాయని దర్శకుడు రాజమౌళికి బాగా తెలుసు.అందుకే బాహుబలి విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.భారీ మాస్‌ఫాలోయింగ్‌ ఉన్న తారక్‌,చరణ్‌ కాంబినేషన్‌తో తనపై నెలకొన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.కథతో పాటు చిత్రంలో పాత్రల విషయంలో కూడా రాజమౌళి ఏమాత్రం రాజీ పడడం లేదు.హీరోలు మినహా మిగిలిన అన్ని పాత్రలకు అన్ని భాషల నటీనటులను తీసుకుంటూ వ్యాపరపరంగా కూడా ప్రాజెక్ట్‌ పరిధిని పెంచుతున్నాడు.హీరోయిన్‌లుగా అలియాభట్‌,బ్రిటన్‌కు చెందిన నటి డైసీని తీసుకోగా కీలక పాత్రల కోసం తమిళ దర్శకనటుడు సముద్రఖని,బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌లను ఎంపిక చేసుకున్నాడు.తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్‌ స్టార్స్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటింపచేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.సంజయదత్‌,యువ హీరో వరుణ్‌ ధావన్‌లు చిత్రంలో స్వాతంత్య్ర సమరంలో వచ్చే కొన్ని సన్నివేశాలకు సరిగ్గా సరిపోతారని భావించిన రాజమౌళి ఆ పాత్రల కోసం వరుణ్‌,సంజయ్‌దత్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాడట..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos