జగన్‌ ది క్విడ్ ప్రో కో విధానం

అమరావతి: ‘క్విడ్ ప్రో కో (నీకిది- నాకది) జగన్‌ విధానమ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు ఆరోపించారు. బుధవారం ఇక్కడి నుంచి తెదేపా శ్రేణులతో టెలికాన్ఫరెన్సు
నిర్వహించారు.  కేసు లు మాఫీ చేస్తే ఆంధ్రప్రదేశకు  ప్రత్యేక హోదా అడగనని నరేంద్ర మోదీతో జగన్‌ లోపాయి కారి ఒప్పందాన్ని
కుదుర్చుకున్నారని  ఆరోపించారు. ‘కప్పం కడతాను మీకు-  నా భూముల స్వాధీనం వద్దు’ అని కేసీఆర్‌తో కూడా అవగాహన కుదుర్చుకున్నారని
దుయ్యబట్టారు.  ‘జగన్ కు
వ్యతిరేకంగా దాఖలైన అవినీతి,అక్రమాల కేసుల దర్యాప్తు నత్త నడకన సాగటం మోదీ గిఫ్ట్’  అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌  తాకట్టు మోదీకి జగన్‌ ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ అని మండిపడ్డారు.  అందుకే ప్రతి నిమిషం తననే జగన్‌ నిందిస్తాడని, మోదీని నిలదీయడన్నారు. ‘మన ప్రత్యర్థి కరడు గట్టిన నేరస్థుడని గుర్తించండి. నేరగాళ్లతో పోరాటంలో అనుక్షణం అప్ర మత్తంగా ఉండాలి.  వైకాపాకు ఒక్క అవకాశం ఇస్తే పెను ప్రమాదం.  భూములు మింగేస్తారు.. ఆస్తులు కబ్జా చేస్తార’ని ధ్వజ మెత్తారు.  హైదరాబాద్‌లో ఆస్తులున్న తెదేపా అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా తెరాసా, వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ గెలుపు కోసమే కేసీఆర్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశలో
తన చేతి కీటుబొమ్మను ముఖ్యమంత్రిగా నియమించేందుకు  కుట్రలు పన్నారని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos