తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెరాస అధినేత కేసీఆర్,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిల మధ్య వైరత్వం చాలా ప్రత్యేకం.మాటలతోనే మంటలు పుట్టింగల వాగ్ధాటి ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు,ఏదైన అంశంపై వాదనలు వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి.ఇక శాసనసభ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఘోరంగా ఓడిపోయిన రేవంత్‌రెడ్డి లోకసభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న రేవంత్‌రెడ్డి ప్రచారాలు ముమ్మరం చేశారు.ఈ క్రమంలో కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి ఓ సవాల్ విసిరారు.తనపై ఎవరో రియల్టర్లు,బ్రోకర్లను పోటీకి నిలబెట్టడం కాదని దమ్ము, ధైర్యం ఉంటే మల్కాజ్‌గిరిలో నువ్వే వచ్చి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.తెలంగాణలో దొరల పాలన సాగిస్తున్న కేసీఆర్ పాలనను అంతమొందించడమే తన లక్ష్యమని అందుకు చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతానని అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతు ఇవ్వాలన్నారు.శాసనసభ ఎన్నికల్లో ఎల్‌బీ నగర నియోజకవర్గ ప్రజలు నమ్మి సుధీర్‌రెడ్డికి ఓటేశారని తాను కూడా సుధీర్‌రెడ్డిపై నమ్మకంతో ప్రచారాలు చేశానని చివరకు అటు ప్రజలకు ఇటు తమకు సుధీర్‌రెడ్డి నమ్మకద్రోహం చేశారంటూ విమర్శించారు.కాంగ్రెస్ సీనియర్ మహిళ నేత సబిత ఇంద్రారెడ్డిని ఆదరించింది కాంగ్రెస్ పార్టీయేనని పార్టీలో కీలకపదవులు ఇచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సబిత చిరవకు చేసిందేమిటంటూ ప్రశ్నించారు.ఎన్నికల్లో పోటీచేయనని తనతో చెప్పిన .. సబితా చివరికి టీఆర్ఎస్‌లోకి వెళ్లడం న్యాయమా అని ప్రశ్నించారాయన.