
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభ నష్టాల మధ్య ఊగిస లాడాయి. ఉదయం 9.38 గంటలకు సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో 38,358 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,553 వద్ద ట్రేడయ్యాయి. సమాచార సాంకేతికత, స్థిరాస్తి రంగాల షేర్లు లాభాల్లో ఉండగా జెట్ ఎయిర్ వేస్ షేరు ధర ఏకంగా నాలుగు శాతం పతనమైంది. ఇటీవల ఎతిహాద్ సంస్థ తన 24 శాతం వాటాను విక్రయిస్తామని ప్రకటించ డంతో మార్కెట్లో జెట్ ఎయిర్ వేస్ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణయాలను ప్రకటించనున్నందున ఆసియా మార్కెట్లు మందకొడిగానే ఉన్నాయి. జపాన్ సూచీ 0.1శాతం కుంగింది. భారత మార్కెట్లనూ కూడా అమెరికా విధానం ప్రభావితం చేస్తుందని నిపుణుల మదింపు.