
హైదరాబాద్: ఓటమి కళ్ల ముందు మెదులుతుంటే చంద్రబాబు లాంటి నేతలు అడ్డగోలుగా మాట్లాడటంలో ఆశ్చర్యమేమీ లేదని వైకాపా ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళ వారం ట్వీట్లో వ్యాఖ్యానించారు.‘బిహార్‌ను కించ పరిచే దుర్భాషలు ఆడటం కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీకు ఎందుకు ఓటెయ్యాలనే దానిపై దృష్టి కేంద్రీ కరించాలని’ చంద్రబాబుకు సూచించారు. ‘ఓటమి తథ్యమని తేలినపుడు ఎంతటి రాజకీయ నాయకుడినైనా మానసికంగా దెబ్బ తింటాడు. చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్న భాష నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. కేసీఆర్ క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారని, బిహార్ బందీపోటు ప్రశాంత్ కిషోర్ ఏపీలో లక్షలాది ఓట్లను తొలగించారని చంద్రబాబు ఒంగోలు ఎన్నికల ప్రచార సభలో ఆరోపించినందుకు ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు స్పందించారు.