
కరాచి : ఇంగ్లండ్‌లో జరుగనున్న క్రికెట్ ప్రపంచ కప్పులో భాగంగా జూన్ 16న ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఎలాంటి భద్రత సమస్య లేదని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. కరాచిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణ, భద్రత విషయాల్లో తనకెలాంటి అనుమానాలు లేవని చెప్పారు. పుల్వమాలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో నలభై మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినందున, పాకిస్తాన్తో ఇండియా ప్రపంచ కప్పులో ఆడరాదనే డిమాండ్లు వినవస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రిచర్డ్సన్ పైవిధంగా స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌కు ఆపాదించరాదని ఆయన సూచించారు.