
విశాఖ పట్టణం: ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ. పాల్ మంగళవారం ఇక్కడి జైల్ రోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తన సొసైటీ పేరుతో ఉన్న ఫ్రీజ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. సొసైటీ తన దేనని, దానికి తానే అధ్యక్షుడినని కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని అధికారులకు వివరించారు. ‘ మీకు డబ్బు ఇవ్వాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి. ఇంతవరకు మాకు అలాంటి ఆదేశాలు రాలేదు. అందువల్ల మీకు డబ్బు ఇవ్వలేమ’ని బ్యాంకు సిబ్బంది పాల్ కు విపులీకరించారు. దీంతో కేఏ పాల్ అధికార్ల వైఖరికి ఆగ్ర హించి అక్కడి నుంచి నిస్సహాయంగా వెనుదిరిగారు.