రాజీవ్‌ గాంధీ హంతకుల విడుదలకు డిఎంకే యత్నం

చెన్నై: లోక్ సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంత కుల విడుదలకు కృషి చేస్తామని డీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ అధినేత ఎంకే. స్టాలిన్ మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టే సంకీర్ణ కూటమిలో తమ పార్టీ ఉంటే రాజీవ్ గాంధీ హంతకులు ఏడుగురి విడుదలకు కచ్చితంగా ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చింది. శ్రీ లంక శరణార్థులకు పౌర సత్వాన్ని కల్పిస్తామని, విద్యార్థులకు శిరో భారంగా మారిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష – నీట్ ను రద్దు చేస్తామని, ప్రయివేటు రంగాల్లో కూడా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇంకా విద్యా రుణాల్ని కూడా మాఫీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, మరిన్ని ఉద్యోగాలు కల్పి స్తామని , పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను క్రమబద్ధీ కరిస్తామని భరోసా ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos