
న్యూఢిల్లీ: లోక సభకు రెండో విడత ఎన్నికల అధికారిక ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం మంగళ వారం ఇక్కడ విడుదల చేసింది. ఏప్రిల్ 18న 97 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. పోటీ చేయదలచిన అభ్యర్థులు ఈ నెల 26 లోగా నామపత్రాల్ని దాఖలు చేయాలి. మరుసటి రోజు నామ పత్రాల్ని పరిశీలిస్తారు. 29 లోగా నామపత్రాల్ని ఉపసంహరించుకోవచ్చు. రెండవ విడతలో తమిళ నాడులోని 39, కర్ణాటకలోని 14, మహారాష్ట్రలోని 10, ఉత్తర్ ప్రదేశ్లోని 8, అస్సాం, బీహార్, ఒడిశాల్లో ఐదేసి వంతున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ మూడేసి, జమ్ము- కాశ్మీర్లో రెండు, 2, మణిపూర్, త్రిపుర, పుదుచ్చేరిలలో ఒక్కో నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.