కేసీఆర్‌ తీరుతో చాలా బాధపడ్డా..

కేసీఆర్‌ తీరుతో చాలా బాధపడ్డా..

ప్రముఖ నటుడు,రాజకీయ నేత బాబు మోహన్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.కేసీఆర్‌తో తనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని కేసీఆర్‌ను నేను ప్రేమగా బావా అని పిలుచుకుంటునాని గుర్తు చేసుకున్నారు.నేను అంతగా ప్రేమించిన వ్యక్తి నన్ను దూరం పెట్టడం చాలా బాధ కలిగించిందన్నారు.తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే మూడు రోజుల ముందు కేసీఆర్‌ను కలిశానని అప్పుడు కూడా ఆప్యాయంగా కౌగలించుకొని మాట్లాడారన్నారు.కానీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యాక అందులో నా పేరు లేకపోవడంతో చాలా బాధపడ్డానని ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని అటువంటిది కేసీఆర్‌ నన్ను ఒక్క మాట కూడా చెప్పకుండా టికెట్‌ నిరాకరించారన్నారు.ఉరి తీసేవాడికి ఇచ్చే గౌరవాన్ని కూడా కేసీఆర్‌ తనకు ఇవ్వలేదని వాపోయారు.నన్ను ఎమ్మెల్యేని చేసిన కేసీఆరే ఎందుకు దూరం పెట్టాడో అర్థం కావడం లేదన్నారు.ఇక తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనను తలచుకొని బాబు మోహన్‌ కన్నీటి పర్యంతమయ్యారు.చిన్న పాపను రక్షించబోయి తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని నా కొడుకు మరణం నుంచి తాను ఇప్పటికీ కోలుకోలేక పోతున్నానన్నారు.కొడుకు గుర్తు వచ్చిన ప్రతీసారి నేనేం పాపం చేశానో దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష విధించాడోనని బాధ పడుతుంటానన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos