బాలీవుడ్ క్రేజీ
హీరోయిన్ అలియాభట్‌కు ఎంత అందమైన రూపం ఉందో అంతే అందమైన మనసు కూడా ఉందంటూ సన్నిహితులతో
పాటు బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతుంటారు.తన చుట్టు ఉన్న వ్యక్తులకు గుప్త దానాలు చేయడంలో
అలియా ఎప్పుడు ముందుంటుందని తాజాగా వెలుగు చూసిన ఘటన రుజువు చేస్తోంది.ఈనెల 15వ తేదీన
పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న అలియా కెరీర్ మొదటి నుంచి తనతో పాటు ఉన్న కారు డ్రైవర్
సునీల్ తన ఇంట్లో పని చేసే అమోల్ అనే మహిళ పనిమనిషికి రూ.50 లక్షల విలువ చేసే సింగిల్
బెడ్‌రూమ్ ఇళ్లను కానుకగా ఇచ్చింది.ఇన్నేళ్లుగా తన కోసం కష్టపడుతున్న సునీల్,అమోల్‌కు
ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ముంబయి నగరంలో ఖరీదైనా ప్రాంతంలో తన పుట్టినరోజు కానుకగా ఇళ్లను
బహుకరించింది.అలియా ఇచ్చిన ఖరీదైన కానుకకు సునీల్,అమోల్‌లు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారట.కాగా
బాలీవుడ్‌లో కోట్లాది రూపాయాల పారితోషకం తీసుకునే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగినా
తన కోసం కష్టపడుతున్న కారు డ్రైవర్ సునీల్,ఇంటి పనిమనిషి అమోల్‌లు ఇప్పటికీ ఇళ్లు
లేక ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించి ఇరువురిపై గౌరవంతో ఇళ్లను కానుకగా అందించినట్లు
అలియాభట్ సన్నిహితులకు తెలిపినట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలిసి బాలీవుడ్ వర్గాలతో
పాటు అలియా అభిమానులు అలియాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు..