
జమ్మూ: పాక్ సరిహద్దులోని ఆఖ్నూర్, సుందర్బనీ సెక్టార్లలో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైనికులు మోర్టార్ షెల్స్, చిన్న తుపాకులతో మళ్లీ కాల్పులు జరిపారు. సోమవారం రాత్రి 10.45 గంటల నుంచి ప్రారంభమైన ఈ కాల్పులు మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు సమర్ధంగా తిప్పి కొట్టారు. పుల్వామా ఉగ్ర దాడి, భారత వాయు సేన ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపిన అనంతరం పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.