తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విశ్వహిందు పరిషత్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు
ఫిర్యాదు చేశారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సోమవారం కరీంనగర్‌లో బహిరంగ సభలో
ప్రసంగించిన కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు.సభలో
‘హిందూగాళ్లు – బొందగాళ్లు-దేశం దిక్కుమాలిన దరిద్రుల చేతిలో ఉంది’ అంటూ కేసీఆర్ హిందువులపై
అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు.కేసీఆర్‌కు జాతీయ సమగ్రత,సార్వభౌమత్వంపై
ఏమాత్రం గౌరవం లేదని అత్యున్యత న్యాయస్థానంపై కూడా కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ
ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదులేఖతో పాటు కేసీఆర్ ప్రసగించిన సీడీ కూడా ఎన్నికల
ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు అందించారు.ఫిర్యాదు స్వీకరించిన రజత్‌కుమార్ నివేదికలు
ఇవ్వాలంటూ కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు.నివేకలు అందాక పరిశీలించి
చర్యలు తీసుకుంటామని రజత్‌కుమార్ హామీ ఇచ్చారు..