గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్

పనాజీ: గోవా13వ ముఖ్యమంత్రిగా భాజపా నేత, ప్రస్తుత స్పీకర్ ప్రమోద్ సావంత్ సోమవారం అర్ధరాత్రి ప్రమాణం చేశారు. పారికర్ మంత్రి వర్గంలో సభ్యులుగా ఉన్న 11 మంది మళ్లీ మంత్రులుగా ప్రమా ణాల్ని చేశారు. మిత్ర పక్షాలైన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్పీ) అధినేత విజయ్ సర్దేశాయ్, మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్కు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. పారికర్ వారసుడి ఎంపికకు మిత్ర పక్షాల మధ్య ఆదివారం రాత్రి నుంచి విస్తృత స్థాయిలో చర్చలు సాగి చివరికి ప్రమోద్ సావంత్ను ముఖ్య మంత్రిగా ఎంపిక చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos