భాగ్యనగరి సాఫ్ట్‌వేర్‌ పక్షులకు శుభవార్త..

భాగ్యనగరి సాఫ్ట్‌వేర్‌ పక్షులకు శుభవార్త..

భాగ్యనగర వాసులు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ పక్షులు ఎప్పుడెప్పుడా అని వేల కళ్లతో ఎదురు చూస్తున్న హైటెక్‌సిటీ మెట్రో మార్గంలో బుధవారం నుంచి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది.హైటెక్‌ సిటీ మెట్రో కారిడార్‌ను బుధవారం ఉదయం 09.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు.హైటెక్‌ సిటీకి మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో హైటెక్‌ సిటీలో పని చేసే లక్షలాది మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ప్రతీరోజూ గంటల తరబడి దుమ్ము,ధూళిని తట్టుకుంటూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కొని తాబేలు వేగంతో ప్రయాణించే బాధల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది.ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో గవర్నర్‌తో పాటు మరికొంత మంది అధికారులు మాత్రమే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు.అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు పది కీలోమీటర్ల మేర మెట్రో మార్గం పూర్తి కావడంతో రెండు కారిడార్ల పరిధిలో మొత్తం 56 కిలోమీటర్ల మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.ఇక మొదటిదశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో మరో 15 కిలోమీటర్ల మార్గం పనులు పూర్తయితే మొదటిదశ పనులు పూర్తయివుతాయి.ఈ ఏడాది ఆఖరున మొదటిదశ మెట్రో పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos