ముంబై:విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళ వారం లాభాలతో ట్రేడింగ్ ఆరంభించింది. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 38,167 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,500 వద్ద ట్రేడ య్యాయి. పక్క రూపాయి స్వల్పంగా రెండు పైసలు విలువ కోల్పోయి 68.55 ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత బలపడి 9.45 సమయంలో 68.42 వద్ద ట్రేడయ్యింది. అనంతరం ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ఊగిసలాట ధోరణి కనపడింది. సూచీలు రెండు కీలక మద్దతు స్థాయిల్లో స్థిరంగా ఉన్నాయి. ఆటో, టెక్ రంగాలు నష్ట పోతుండగా, బ్యాంకింగ్, ఫార్మా లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ మద్దతుతో అనిల్ అంబానీ నేతృత్వం లోని అడాగ్ షేర్లన్నీ లాభపడు తున్నాయి. ఎరిక్సన్ చెల్లింపులపై ముకేశ్ అంబానీ చేయూత నందించి అరెస్టు ముప్పు నుంచి అనిల్ అంబానీని కాపాడిన సంగతి తెలిసిందే. దీంతో అడాగ్ గ్రూపుకు చెందిన ఆర్‌కాం 10 శాతం, రిలయన్స్ పవర్ 5 శాతం ఎగిసింది. ఇంకా రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్ తదితర షేర్లు లాభ పడు తున్నా యి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఎస్బీఐ టాప్ విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. ఇండిగో, స్పైస్ జెట్ లాభపడుతుండగా, జెట్ ఎయిర్వేస్, అశోక్ లేలాండ్, టీవీస్, టాటా మోటార్స్ , హీరో మోటో, ఐషర్ మోటార్స్, మారుతి, టీసీఎస్, మైండ్‌ట్రీ, వేదాంతా నష్టపోతున్నాయి.