అమరావతి: అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలనే ఎన్నికల బరిలోకి దించినందున గెలుపు తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తీకరించారు. మంగళవారం ఉదయం ఇక్కడి తన నివాసం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రత్యర్థులు తప్పుడు సర్వేలతో ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా తెదేపా గెలుపును ఎవరూ ఆప జాలరన్నారు. ప్రజల్లో తెలుగుదేశం పట్ల ఉన్న సానుకులతను ఎవరూ తగ్గించ లేరంటూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని సంక్షేమ పథకాల లబ్ధిదారులు కసి ఉన్నారని చెప్పారు. దీంతో ఓటమి భయం వెంటా డటంతో వైకాపా దిక్కు తోచని ఆయోమయ స్థితిలో ఎంతటి అరాచకాలకైనా పాల్పడేందుకు సిద్ధమవు తున్నందున కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.