ఢిల్లీ : స్థానికంగా తగ్గిన డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బంగారం ధర సోమవారం రూ.280 తగ్గి రూ.33 వేలకన్నా దిగువకు చేరింది. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,830కి చేరుకుంది. వెండి రూ.345 తగ్గడంతో కిలో ధర రూ.38,725 వద్ద నమోదైంది. కార్పొరేట్ల నుంచి డిమాండ్ లేకపోవడం, నాణేల తయారీదార్ల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ధర తగ్గిందని వర్తకులు తెలిపారు.