నల్గొండ బరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి…!

నల్గొండ బరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి…!

హైదరాబాద్‌ : నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి
పోటీ చేయాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పై ఒత్తిడి పెరుగుతోంది.
పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా పోటీ చేయాల్సిందిగా ఆయనకు సూచించినట్లు తెలిసింది.
పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యం నింపడానికి పోటీ చేయాలని రాహుల్‌ ఆయనను అనునయించారని
సమాచారం. ఈ స్థానం నుంచి జానారెడ్డి లేదా కోమటి రెడ్డి వెంకట రెడ్డి పోటీ చేస్తారని
అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం హుజూర్‌ నగర్‌ శాసన సభ స్థానానికి ప్రాతినిధ్యం
వహిస్తున్న ఉత్తమ్‌నే పోటీ చేయించాలని అధిష్టానం దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. కోమటి
రెడ్డి వెంకట రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేయనున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య పేర్లు కూడా దాదాపుగా ఖరారయ్యాయని సమాచారం.  పార్టీ ఇదివరకే ఆదిలాబాద్-రమేష్ రాథోడ్, మహబూబాబాద్-బలరాం నాయక్, పెద్దపల్లి -ఎ.చంద్రశేఖర్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి-రేవంత్ రెడ్డి, జహీరాబాద్-మదన్ మోహన్, చేవెళ్ల-కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్-గాలి అనిల్ కుమార్ పేర్లను ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos