నిరుద్యోగాన్ని పెంచిన మోది:రాహుల్

నిరుద్యోగాన్ని పెంచిన మోది:రాహుల్

బెంగళూరు: రాఫెల్‌  యుద్ధ విమానాల తయారీ నుంచి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను  ప్రధాని నరేంద్ర మోది తప్పించినందున వేలాదిగా విద్యావంతులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్య క్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.సోమవారం సాయంత్రం కల్బుర్గి నగరంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిప్పులు చెరి గారు.  ‘తాను చౌకీదార్‌ (కాపలాదారుడు)లా పని చేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. అయితే, ఆయన ఎవరికి కాపలాదారుగా పని చేస్తున్నారు?  అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్‌ మల్యకాపలా దారుగా సేవ చేస్తున్నార’ని వ్యాఖ్యానించారు. ‘ కర్ణాటక యువత ఉద్యోగాలు కావాలని ఆయనను అడిగారు. ప్రధాని మోదీ  మీకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ద్వారా యుద్ధ విమానాలను తయారు చేయాల్సి ఉంది. ఇదే జరిగితే మీకు ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పటివరకు యుద్ధ విమానాలు తయారు చేయడంలో అనుభవం లేని వ్యక్తికి ఆ కాపలా దారుడు అవకాశం ఇచ్చారు’ అని ధ్వజ మెత్తారు. ‘రాఫేల్‌ ఒప్పందం అక్రమాలు అవినీతి గురించి విచారణ చేయ దలచిన సీబీఐ సంచాలకుణ్ని  రాత్రికి రాత్రే  ఉద్యోగం నుంచి తొలగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఆయన్ను నియమించక తప్ప లేదు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆయనకు ఉద్వాసన పలికారు.  చౌకీ దార్‌ పట్టు బడ్డారు.  దీంతో ఆయన మొత్తం  దేశమంతా  చౌకీదార్లే ఉన్నారని అంటు న్నారు. ఆయన  దొరికి పోక ముందు మాత్రం ఇలా అనలేద’ని దుయ్యబట్టారు. 15 మంది బడా శ్రీమంతుల రుణాలు రూ.3.5 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ రుణాల ఊభిలోని అన్నదాతలకు మొండి చేయి చూపిందని మండిపడ్డారు. తాము ఇచ్చిన ఎన్నికల  హామీలన్నింటినీ నెరవేర్చామని పేర్కొ న్నారు.   ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ విధానసభ ఎన్నికల్లో తాము ప్రజలకు ఇచ్చిన భరోసా ప్రకారం రాజ్యాధికారాన్ని చేపట్టిన వెంటనే రైతుల రుణాల్ని మాఫీ  చేసినట్లు తెలిపారు. గత నాలుగు న్నర దశాబ్ధాల్లో ఎన్నడూ లేనంతటి నిరుద్యోగం  దేశంలో తిష్ట వేయటంతో విలువైన మానవ వనరులు వృధా అవుతున్నాయని ఆక్రో శించారు. భాజపా  దేశ    ప్రజలను రెండుగా విడదీయాలని చూస్తోందని మండిపడ్డారు.  వారి పాలనలో దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు మాధ్యమాల ముందుకు వచ్చార’ ని విమర్శలు గుప్పించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos