మోదీ శ్రీమంతుల కాపలాదారే: ప్రియాంక

లక్నో:  ప్రధాని నరేంద్ర మోదీ ‘ధనవంతులకే వాళ్లు కాపలాదారు, రైతులకు కాదు.’ అని తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. గంగా యాత్ర‌ పేరిట సోమవారం ఆరంభమైన ఎన్నకల ప్రచార సభల్లో ఆమె
ప్రసంగించారు.  ‘ మహిళలు, చిన్నారులు, యువకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.ఇందువల్లే  ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొంద’ని విశ్లేషించారు. ‘కొందరు రాజకీయ గిమ్మిక్కుల ప్రయోగిస్తున్నందున  ప్రజలు తమ ఇబ్బందులను  తనతోనూ, కాంగ్రెస్ నాయకులతోనూ పంచుకుంటున్నార’ని ప్రియాంక అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల విద్యార్ధులతో
ప్రియాంక గాంధీ పడవలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 21న ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఆమె పర్యటించనున్నారు. విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ జరిగే హోలీ సంబరాల్లో  కూడా ప్రియాంక
పాల్గొన్ననున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos