స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ

స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ

బెంగళూరు: మాజీ సినీ నటి సుమలత వచ్చే లోక్‌సభ
ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సోమవారం
ఆమె ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో  మాట్లాడారు.
 ‘నేను తీసుకున్న ఈ నిర్ణయం ఎవరినైనా బాధిస్తే
అందుకు క్షమించండి. నా భర్త దివంగత అంబరీష్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం
తీసుకున్నా. అంబరీశ్‌ను తాము ఎంతగానో విశ్వసించేవారమని మండ్యలో ప్రతి ఒక్కరూ చెప్పారు.
అదే విశ్వాసాన్ని ఇప్పుడు నాపైనా చూపిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. అంబరీష్‌
గతంలో ఒక సారి మండ్య నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పని
చేశారు. అనారోగ్యంతో మృతి చెందారు.  ఈ సారి
ఎన్నికల్లో మండ్య నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుమలత ప్రయత్నించారు.
 కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో
ఉన్నందున   పొత్తులో భాగంగా మండ్య స్థానం జేడీఎస్‌ వశమైంది.
దీంతో పార్టీ పై అసంతృప్తి చెందిన ఆమె మాజీ ముఖ్యమంత్రి,  భాజపా నేత ఎస్‌ఎం కృష్ణతో  కూడా భేటీ అయ్యారు. చివరకు  స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos