గోవా పీఠానికి హస్తం యత్నం

గోవా పీఠానికి హస్తం యత్నం

 ప‌నాజి:గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశమివ్వాలని గోవా గవర్నర్‌ మృదులా సిన్హాకు  విధానసభలో విపక్ష  నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ (కాంగ్రెస్‌)  విన్నవించారు.  గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మృతితో రాష్ట్ర విధానసభలో భాజపా సభ్యుల సంఖ్య 12కు పడిపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రతిపాదన చేసింది.   మనోహర్‌ పారికర్‌ ఉత్తరాధికారి విషయమై చర్చలు కొనసాగు తున్నాయి. భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆది వారం గోవా చేరుకుని భాగస్వామ్య
పక్షాలతో  రాత్రి బాగా పొద్దు పోయే వరకూ
మంతపాలు సాగించారు.  ఫరిక్కర్‌ వారుసుడు  ఎవరన్న దాని పై ఇంకా స్పష్టత రాలేదని విధానసభ
ఉపసభాపతి  మైకేల్‌ లోబో తెలిపారు. సంకీర్ణ
పక్షమైన మహారాష్ట్ర వాదీ గోమంతక్‌ పార్టీ నేత సుదిన్‌ ధావలికర్‌ తననే ముఖ్యమంత్రిగా
నియమించాలని పట్టు బడుతున్నట్లు తెలిపారు. భాజపా సభ్యులు కూడా పార్టీ కి చెందిన వారినే
ముఖ్య మంత్రిగా ఎంపిక చేయాలని వాదిస్తున్నందున విషయం  కొలిక్కి రాలేదన్నారు.మరో భాగ స్వామ్య పక్షమైన
గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధినేత విజయ్‌ సర్‌ దేశాయ్‌ కూడా భాజపా అధినాయకత్వంతో
సంప్రదింపులు జరుపుతున్నారు. ‘‘సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశా లను
వారితో చర్చించాం. ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మా ప్రతి పాదనలు వారి ముందు
ఉంచాం. వాటిపై స్పందించాల్సి ఉంది. మా పార్టీ ఇంతకాలం మనోహర్‌ పారికర్‌కు మద్దతు
పలికింది. భాజపాకు కాదు’’ అని  వివరించారు.
భాజపాకు సొంతంగా 12 మంది , మిత్ర పక్షాలతో కలిపి 20 మంది విధానసభ సభ్యుల బలం ఉంది.
14 మంది సభ్యులతో దిగువ సభలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos