తెలంగాణలో తనదైన మార్కు రాజకీయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న గులాబి బాస్ కేసీఆర్ కొత్తగా తన దృష్టికి వచ్చిన వార్తతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారని సమాచారం.లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బరిలో దిగనున్న తమ కుమార్తె కల్వకుంట్ల కవితకు షాక్ ఇవ్వడానికి నిజామాబాద్ జిల్లా రైతులు సిద్ధమవుతున్నట్లు తెలియడంతో కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారట. పసుపు-ఎర్రజోన్న మద్దతు ధరపై అనేకసార్లు కవిత దృష్టికి తీసుకెళ్లిన కవిత పట్టించుకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ సారి కవితకు షాక్ ఇవ్వడానికి రైతులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సుమారు వెయ్యి మంది రైతులు కవితకు పోటీగా ఎన్నికల బరిలో నిల్చోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన తెరాసకు రాష్ట్రంలోని అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరు మీద నడకే. అందులోనూ నిజామాబాద్లో స్వయంగా కేసీఆర్ కుమార్తే బరిలో ఉండడం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కి సైతం వేరు నియోజకవర్గాన్ని చూసుకోవడంతో కవిత గెలుపు ఏకపక్షమేనని అంతా భావించారు.ఈ తరుణంలో వెయ్యి మంది రైతులు కవితకు వ్యతిరేకంగా బరిలో దిగుతున్నట్లు వినిపిస్తున్న వార్తలు కేసీర్కు గుబులు పెంచుతున్నాయి.ఇదే జరిగితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ వాడాల్సి ఉంటుంది. దాని ఫలితం ఎన్నిక వాయిదా పడే అవకాశాలుంటాయి. ఇలా సార్వత్రిక ఎన్నికల వేళ కవిత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు..