సెన్సార్‌ బోర్డుపై కేసు వేస్తా..

  • In Film
  • March 18, 2019
  • 205 Views
సెన్సార్‌ బోర్డుపై కేసు వేస్తా..

ఎప్పుడూ వివాదాత్మ వ్యాఖ్యలతో సహవాసం చేస్తూ వివాదాల్లోనే మునిగి తెలుతుంటే దర్శకుడు ఆర్జీవీ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.తన సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను దురుద్దేశంతో విడుదుల కానివ్వకుండా అడ్డుకుంటున్నారని సెన్సార్‌బోర్డుపై ఆరోపణలు చేసిన ఆర్జీవీ సెన్సార్‌ బోర్డుపై కోర్టులో కేసు వేయనున్నట్లు ప్రకటించారు.ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లపై లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ మార్చ్‌22వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు.అయితే సెన్సార్‌బోర్డు నుంచి క్లియరెన్స్‌ కోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్న వర్మ క్లియరెన్స్‌ ఇవ్వడానికి సెన్సార్‌ బోర్డు నిరాకరిస్తున్నట్లు తెలుసుకొని అగ్గిమీద గుగ్గిలమయ్యారు.ఎన్నికల్‌ కోడ్‌ అమలులో ఉన్నందును ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో క్లియరెన్స్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నామంటూ సెన్సార్‌బోర్డు అధికారులు చెబుతున్నారంటూ వర్మ ట్వీట్టర్‌లో విమర్శలు గుప్పించాడు.సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం సెన్సార్‌ బోర్డుకు సెన్సార్‌ ప్రక్రియ వాయిదా వేసే అధికారం లేదని చిత్రంలో ఏవైనా అభ్యంతకర సన్నివేశాలు ఉంటే తొలగించే అధికారం మాత్రమే సెన్సార్‌ బోర్డుకు ఉంటుందన్నారు.కానీ నిబంధనలకు వ్యతిరేకంగా తన సినిమాను విడుదల చేయనివ్వకుండా వాయిదా వేయడానికి సెన్సార్‌ బోర్డు అధికారులు ప్రయత్నిస్తున్నారని దీనిపై కోర్టును ఆశ్రయించనున్నామంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos